/rtv/media/media_files/2025/01/24/y2N6cht0gb80TwBDZNyV.jpg)
Shaikh Baji Photograph: (Shaikh Baji )
ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరికీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
షేక్ బాజీ అతని భార్య ప్రేజా కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదు నెలల క్రితం బాజీ బైక్ మెకానిక్ గా పని చేసేందుకు కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లాడు. గతంలో బైక్ చోరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో అతడిని పలుమార్లు పోలీసులు విచారించినట్లు సమాచారం.
ఇటీవల ఓ దొంగతనం కేసులో ఇద్దరు పోలీసులు బాజీ ఇంటికి వచ్చి బైక్ తాళాలు తీసుకుని వెళ్లిపోయారు. గురువారం ఉదయం వారు తిరిగి వచ్చి అతని ఇంటిని సోదా చేసి విచారణ కోసం తీసుకెళ్లారు. బాజీ భార్య, అతని తండ్రిని కూడా పోలీసులు ప్రశ్నించారు.
దీనిని అవమానంగా భావించిన ప్రేజా పోలీసులు వెళ్లాక తన ఇద్దరు బిడ్డలు మెహెక్ (6), మెనురూల్ (7) చీరతో ఉరేసి చంపేసింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం ఇంటి నుంచి ఎవరు కూడా బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలికి కెళ్లి చూడగా ముగ్గురు చనిపోయి ఉన్నారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షేక్ బాజీ తరుచుగా దొంగతనాలు చేస్తుండటంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు చెబుతున్నారు. దొంగతనాలు మానకపోతే పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోతానని కూడా బాజీకి ప్రేజా చెప్పినట్లు తెలిపారు.
అయితే పోలీసులు ఇంటికి రెండుసార్లు వచ్చి కుటుంబ సభ్యులను ప్రశ్నించడం వల్లే ప్రేజా ఈ దారుణానికి ఒడిగట్టిందని బాజీ బంధువులు ఆరోపించారు. బాజీ కుటుంబ సభ్యులు మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ కొనసాగింది.