/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
కరీంనగర్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లిలో జరిగిన బరాత్ ఓ మహిళ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ఉంటున్న ప్రభాకర్ కుమార్తె నవ్యకి, చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం వివాహం జరిగింది. ఈ క్రమంలో బరాత్‌ను నిర్వహించారు. మొత్తం ఆరుగురు కారులో ఇంటి దగ్గర బయలు దేరారు.. ఇంతలో డ్రైవర్‌కు ఫోన్ రావడంతో కారు దిగి రోడ్డు పక్కన ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు అతివేగంతో కారు నడపడంతో ఓ మహిళ మృతి చెందింది. డ్యాన్స్‌లు వేసిన వారిని చూస్తున్న 12 మందిపై కారు దూసుకెళ్లింది. ఒక మహిళ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
UPDATING.