/rtv/media/media_files/2025/02/21/WbPSLwuc2H8I3wyFmDgM.jpg)
kAMAREDDY Photograph: (kAMAREDDY)
తెలంగాణలోని కామారెడ్డిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లిలో ఓ విద్యార్థిని గుండె పోటుతో మరణించింది. పదవ తరగతి చదువుతున్న శ్రీనిధి(14) కామారెడ్డిలోని కల్కినగర్‌లో పెద్దనాన్న ఇంట్లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉంటూ చదువుతోంది. అయితే గురువారం స్కూల్‌కి బయలు దేరే సమయంలో ఉదయం ఇంటి దగ్గర తినకుండా బయలు దేరింది.
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
స్కూల్‌కి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి..
స్కూల్‌లో తింటానని టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్లింది. నడుస్తూ స్కూల్‌కి వెళ్తున్న ఆ విద్యార్థిని పాఠశాల దగ్గరలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయిసరికి వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్తుండగానే మార్గమధ్యంలో ఆ విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
ఇదిలా ఉండగా తెలంగాణలో ఓ న్యాయవాది గుండె పోటుతో కోర్టులోనే మృతి చెందారు. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కూడా కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాదికి గుండె పోటు రావడంతో కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. వెంటనే గమనించి తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే వెంకటరమణ మృతి చెందారు.
ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..