/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త పెట్రోల్ పోసి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అంబర్‌పేట గ్రామానికి చెందిన నవీన్, రేఖ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉంది. అయితే వీరి కుటుంబం అంబర్‌పేట పటేల్‌నగర్‌లో ఉంటున్నారు.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
అనుమానంతో భార్యను కొట్టి..
తుక్కు సామానుల వ్యాపారం చేస్తూ.. మద్యానికి బానిసగా మారాడు. దీంతో భార్యను అనుమానిస్తూ.. కొడుతుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ఇంటికి తాగి వచ్చి భార్యను కొట్టి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం ఆమె మృతి చెందింది. బాధితరాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అచ్యుతాపురానికి చెందిన షేక్ జహీరా కుమారుడు షబీర్ బీటెక్ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. గత కొంతకాలంగా డిప్రెషన్‌కు గురికావడంతో అతనికి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంటి దగ్గర ఖాళీ గా ఉంటున్నావు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి మందలించింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన షబీర్ పిడికిలితో తల్లి నుదుటిపై గుద్దాడు. అయితే ఆ దెబ్బ చెవి పై భాగాన కణితపై తగలడం తో తల్లి షేక్ జహీర్ బీబీ ఒక్క సారిగా కుప్పకూలి మృతిచెందింది.ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ