/rtv/media/media_files/2025/03/02/FkSvAx4fx3t7ktf9Mozd.jpg)
Karimnagar Photograph: (Karimnagar)
యువతి పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన దారుణ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామడుగు మండలంలో రాజ్ కుమార్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
యువతి ఫిర్యాదు చేయడంతో..
రాజ్‌కుమార్ ఈ విషయం తెలుసుకుని ఆగ్రహానికి గురై తల్లిపై దాడికి పాల్పడ్డాడు. యువతి తల్లి గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. యువతి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్ పొలాలలో తెగి పడిపోయిన బాలిక శరీర భాగాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేరుకున్నారు. ఫిబ్రవరి 27న డ్రోన్ నిఘా సహాయంతో సమీపంలోని పొలాల్లో బాలిక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగా బాలిక శరీరంలోని తెగిపోయిన కాలు, ఛాతీ నుండి తల వరకు పై మొండెం కనిపించాయి.
ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. బాలికను గొంతు కోసి చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. మొదట దీనిని అడవి జంతువుల దాడి కేసుగా అనుమానించినప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో మైనర్‌ను గొంతు కోసి చంపినట్లు తేలింది.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!