/rtv/media/media_files/2025/03/10/1TkEslb7DvHocL7VaERC.jpg)
months baby dead Photograph: (months baby dead)
ఎవరి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో చెప్పలేం. మనకి తెలియకుండా చేసే చిన్న తప్పుల వల్ల కొన్నిసార్లు ప్రాణమే పోతుంది. ఇలాంటి ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, తెలియక చేసిన ఓ 18 నెలల చిన్నారి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో పల్లి గింజ నోటిలో ఇరుక్కుని 18 నెలల బాలుడు మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
వెంటనే ఆసుపత్రికి తరలించానా ఫలితం లేదు..
గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన గుండెల అక్షయ్ అనే 18 నెలల బాలుడు పల్లీ తిన్నాడు. దీంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడటంతో వెంటనే తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అక్షయ్ మృతి చెందాడు. ఎంతో గారాబంగా చూసుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 18 నెలల పిల్లలకు ఇలాంటి పదార్థాలు ఇవ్వడమే తప్పు. బాబు దరిదాపుల్లో ఇలాంటివి ఉంచకూడదు.
ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
ఇదిలా ఉండగా ఇటీవల ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంతో వెళ్లడం వల్ల ప్రైవేట్ బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!