/rtv/media/media_files/2025/01/24/fdLCRVlKBhSJ3EFnZXqk.jpg)
Student Dies in Gambhiram Reservoir
Gambhiram Reservoir : విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల.నాని(20) కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం నాని తన ఆరుగురు స్నేహితులతో కలిసి గంభీరం రిజర్వాయర్ దగ్గరకు వెళ్లారు.
ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్ లో దిగాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నాని మునిగిపోవడంతో తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో కాపాడండి అంటూ కేకలు వేశారు. వెంటనే స్పందించిన గ్రామస్తులు, ఓఎస్డీ ఫౌండేషన్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నాని నీటిలో మునిగిపోయాడు. ఆనందపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిజర్వాయర్ దగ్గరకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనందపురం సీఐ.సిహెచ్.వాసు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : మీర్పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కుక్కతో ఆ పని చేయలేదన్న గురుమూర్తి!
కాగా గంభీరం పోలకొండ, పల్లిమెట్ట నడుమ ఏర్పాటుచేసిన గంభీరం రిజర్వాయర్ మల్ల అప్పారావు కొట్టు మడుగు చాలా ప్రమాదంగా తయారైంది. చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఈ ప్రాంతానికి సరదాగా గడిపేందుకు వస్తుంటారు. అయితే ఈ మడుగులో దిగి ఈత కొట్టాలని ప్రయత్నించిన వందలాదిమంది విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. సరదాగా ఈతకెల్లిన విద్యార్థులు ఊబిలో చిక్కుకుపోయి బయటికి రాలేక మృతిచెందుతున్నారు. ఇప్పటికే వందలాది మంది మృతి చెందినప్పటికీ ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులుగాని, నివారణ చర్యలు గాని అధికారులు చేపట్టడంలేదని స్థానికులు వాపోతున్నారు. నిత్యం ఈ ప్రాంతానికి వచ్చే విద్యార్థులు, మద్యం మత్తులో కొందరు రిజర్వాయర్‌లో దిగి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటుచేసి, పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.