/rtv/media/media_files/2025/04/07/6iLSIrPcJCcWS5IopXub.jpg)
betting sucide
బెట్టింగ్ భూతం ఎందరో యువకుల ప్రాణాలు బలిగొంది. తాజాగా మరో ఘటన కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ వేస్తూ అప్పుల్లో కూరుకుపోయిన కొలనాటి మరణబాబు రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. రమణబాబు ఉద్దండపురం గ్రామంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు.
Also read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
సోమవారం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమణబాబు పూర్తిగా బెట్టింగ్‌కు బానిసై జీతం డబ్బులు కూడా ఇంటికి ఇవ్వకపోయేది. బెట్టింగ్స్ వేస్తూ అప్పులపాలైన రమణబాబు అప్పుల బాధ బరించలేక ఇక తనకు చావే దిక్కనుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.