ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి

రాజస్థాన్​లోని ధోల్​పుర్​ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు.

New Update
accident

Rajastan Road Accident: రాజస్థాన్​లోని ధోల్​పుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

అధిక స్పీడ్‌తో ప్రయాణిస్తున్న..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లో గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్​ కుటుంబసభ్యులతో కలిసి బరౌలీ గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపోని స్పీడ్‌తో వస్తున్న స్లీపర్ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 8 మంది చిన్నారులతో సహా 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు. 

ఇది కూడా చూడండి: Andhra Pradesh: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి ఈ ఘటన జరగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో వారికి చికిత్సను అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Waynad: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్

తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన ఆ స్లీపర్ బస్సును అధికారులు వెంటనే సీజ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్లీపర్ బస్సు డ్రైవర్ అప్రమత్తత వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.               

ఇది కూడా చూడండి: TS: గ్రూప్ –1 పై ప్రభుత్వం చర్చలు‌‌–కీలక ప్రకటన చేసే అవకాశం

Advertisment
Advertisment
తాజా కథనాలు