/rtv/media/media_files/2026/05/15/accident-2026-05-15-17-20-04.jpg)
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబళించింది. అతివేగంగా వచ్చిన ట్యాంకర్ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Karnataka : 4 killed, several injured as tanker rams tractor near Koppal-Vijayanagara district border. pic.twitter.com/aYY1TZI44T
— News Arena India (@NewsArenaIndia) May 15, 2026
ఆలయంలో పూజలు ముగించుకుని
విజయనగర జిల్లా టీబీ డ్యామ్ సమీపంలోని జాతీయ రహదారి 50పై ఈ ఘోర ప్రమాదం సంభవించింది. హుళిగెమ్మ ఆలయంలో పూజలు ముగించుకుని భక్తులు ట్రాక్టర్‌పై తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక ట్యాంకర్ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి రెండు వాహనాలు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ట్యాంకర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us