/rtv/media/media_files/2025/02/24/rwb2lrn12sDLZL5f9Twm.jpg)
వరంగల్లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కారులో వెళ్తున్న సుమంత్‌ను అడ్డుకున్న కొంతమంది దుండగులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సుమంత్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. డాక్టర్ సుమంత్ రెడ్డిని చంపేందుకు సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్ జరిగినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ భార్యనే. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపాలనుకుందని పోలీసులు గుర్తించారు. ప్రియుడికి సుపారి ఇచ్చి మరి.. తన భర్తను హత్యచేయాలని సుమంత్ భార్య స్కెచ్ వేసినట్లుగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
జిమ్‌లో పరిచయం, అక్రమసంబంధం
డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా అనే మహిళ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుమంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా సంగారెడ్డిలో పనిచేశాడు. ఆ సమయంలో అతని భార్య ఫ్లోరా ఓ జిమ్‌కు వెళ్లేది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో ఫ్లోరాను మందలించాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని వరంగల్‌కు షిఫ్ట్ అయిపోయాడు. కాజీపేటలో సుమంత్ ఓ క్లినిక్ పెట్టుకోగా... ఫ్లోరా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ప్రియుడు సామెల్ ను కలుస్తూ ఉండేది. ఇద్దరూ రోజు కలుసుకోవడం కష్టంగా ఉండటంతో భర్తను చంపేయాలని ఫ్లోరా, సామెల్ నిర్ణయించుకున్నారు. సామెల్ కు కొంత డబ్బు ఇచ్చి సుమంత్ చంపేయమని చెప్పింది ఫ్లోరా.
ఈ మర్డర్ చేసేందుకు సామెల్ గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు సహాయం తీసుకున్నాడు. ప్లాన్ లో భాగంగా వరంగల్ భట్టుపల్లిలో ఫిబ్రవరి19న సుమంత్ కారులో వెళ్తుండగా.. అతన్ని అడ్డగించి అతడిపై ఐరన్ రాడ్లతో దాడి నిందితులు దాడి చేశారు. ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్నాడు సుమంత్. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మహారాష్ట్రలో నిందితులను పట్టుకున్నారు.
Also Read : అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!