Contaminated Water : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 90మందికి అస్వస్థత కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంజీవన్‌రావు పేటలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో కలుషితమైన నీరు తాగడం వల్ల ఇద్దరు మృతి చెందడంతో పాటు 90 మందికి పైగా తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. By Kusuma 14 Oct 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కలుషితమైన నీరు తాగి మృతి చెందిన విషాద ఘటన ఈ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలోని సంజీవన్‌రావు పేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రావడం లేదు. దీంతో గ్రామంలోని వారంతా స్థానికంగా ఉన్న బావిలోని నీటిని తాగుతున్నారు. ఆ బావిని శుభ్రం చేయకపోవడం వల్ల నీరు కలుషితం అయ్యింది. దీంతో ఆ బావిలోని కలుషిత నీరు తాగడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇది కూడా చూడండి: Trafficహైదరాబాద్ - విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు నమూనాలు సేకరించి.. వీరితో పాటు గ్రామంలోని ప్రజలు 90 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా.. కలుషిత నీరు తాగడం వల్ల జరిగిందని వైద్యులు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బావిలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఇది కూడా చూడండి: పట్టాలు తప్పిన మరో రైలు.. 24 గంటల వ్యవధిలో మూడో ప్రమాదం..! గ్రామంలో ఈ ఘటన జరగడంతో అధికారులు వెంటనే ఇక్కడ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. అయితే రోజూ విడుదల చేసే మిషన్ భగీరథ నీరు ఎందుకు ఆపేశారో అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తాగడానికి నీరు లేకపోవడం వల్ల కలుషిత నీరు తాగాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు బాధపడుతున్నారు. పండుగ రోజు నీరు లేకపోవడం వల్ల కలుషితమైన బావి నీరు తాగాల్సి వచ్చిందని బాధితులు అంటున్నారు. ఇది కూడా చూడండి: Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే! బావిలో అధికంగా చెత్త పేరుకుపోయిందని, దీనివల్లే నీరు కలుషితమైందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా కనీసం పరిశుభ్రమైన నీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తప్పకుండా పది లక్షలు పరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి రెండు లక్షలు తప్పకుండా ఇవ్వాలని భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: దీపావళికి ప్రయాణం చేసేవారికి శుభవార్త.. ఈ తేదీల్లో తగ్గిన ఛార్జీలు #crime #contaminated-water #sangareddy-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి