/rtv/media/media_files/2024/10/17/xuchw8Y5DVYaNLqOmuH5.jpg)
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో దారుణం ఘటన జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లినే కొడుకు హత్య చేశాడు. నవమాసాలు మోసి చిన్నప్పటి అల్లారు ముద్దుగా పెంచిన తల్లినే దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. మద్యానికి బానిసై ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఆస్తిని తనకి రాసి ఇచ్చేమని మద్యం మత్తులో కన్న తల్లిని కత్తితో పొడిచాడు.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
20 చోట్ల కత్తితో పొడిచి..
ఒక దగ్గర కాదు.. ఏకంగా 20 చోట్ల కత్తితో పొడిచి తల్లిని చంపాడు. స్థానికులు వెంటనే గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స తీసుకుంటూనే ఆ తల్లి మృతి చెందింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. ఆ కొడుకును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కన్న తల్లినే పొట్టన పెట్టుకున్నాడు.
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి
ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాల్‌ఘర్ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ముద్దు చేస్తుండేవారు. ఇది చూడలేని బాలుడు ఈర్ష్యతో ఆ బాలికను చంపాలని ప్లాన్ చేశాడు.
ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
ఈ క్రమంలో రామన్ రాఘవ్ అనే సినిమా చూసి మరి ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. సమీపంలో ఉన్న గుట్ట దగ్గరకు తీసుకుని వెళ్లి ఆమె ముఖంపై పెద్ద బండరాయి వేశాడు. దీంతో ఆ బాలిక అక్కడిక్కడే మరణించింది. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.