సైఫ్ అలీ ఖాన్ కేసు విషయంలో రోజుకో కొత్త విషయం చర్చలోకి వస్తున్న విషయం తెలిసిందే. కేసు విచారణపై సైతం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసుపై వస్తున్న వేలాది ఊహాగానాల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అమెరికాలో మీడియాకు పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారన్నారు. ఇలా చేయడం వల్ల ఊహాగానాలు, వదంతులు నివారించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆర్జీవీ.
ఇది కూడా చదవండి: పోలీసులకు ఊహించని షాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!
With regard to the mystery of Saif ali khan stabbing case and all the thousands of speculation around it , why can’t the police have a spokesperson to brief the media from time to time with regard to cases of huge public interest , like how they do it in America , thereby not…
— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2025
ఈ కేసుపై రోజుకో కొత్త ప్రచారం..
సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి కేసుకు సంబంధించి రోజుకో కొత్త ప్రచారం జరుగుతోంది. అసలు నిందితుడిని వదిలేసి మరొకరిని పోలీసులు పట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ కేసులో ఉన్నది ఒకరు కాదు ఇద్దరుంటూ మరో ప్రచారం కూడా ఊపందుకుంది. సైఫ్ అలీ ఖాన్ అబద్ధం చెబుతున్నారంటూ కొందరు.. లేదు పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు కేసుకు సంబంధించి అధికారిక ప్రకటనలు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!