/rtv/media/media_files/2025/03/15/pqdx36Mn7r5BxH2muwBL.jpg)
Guntur Young woman attack on young man with petrol
AP Crime: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.
తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని..
అయితే మంటలు అంటుకోవడంతో అతని వీపు కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన శ్రీలక్ష్మీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ ఘటన గురించి స్పందించిన శ్రీలక్ష్మీ.. చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పింది. క్యారెక్టర్ గురించి నిందలు వేస్తున్నాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి పద్ధి మార్చుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించి నట్లు తెలిపింది. ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ(27)తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశు కుమార్తె భానుతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే కొంతకాలం వీరి సంసారం బాగానే ఉంది. అయితే ఇటీవల తరచూ దంపతుల మధ్య గొడవలు జరగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు మధ్యలో రాజీ చేస్తూ వస్తున్నారు. అయితే భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బావమరిది, మిగిలిన వారు ఒక్కసారిగా కత్తులతో పీక కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో రక్తపు మడుగులో గిలగిలలాడుతూ శివ అక్కడికక్కడే మృతిచెందాడు. శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
girl | boy | petrol | attack | guntur | telugu-news | today telugu news
Paster Praveen: ప్రవీణ్ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు.
Paster Praveen: మిస్టరీగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. పోలీసులు- వివిధ కోణాల్లో కేసును లోతుగా దర్యాప్తు చేస్తుండగా -ప్రవీణ్ మరణంపై సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముందు ప్రమాదమన్నారు? ఆ తర్వాత హత్య అంటున్నారు? ప్రవీణ్ వచ్చి వెళ్లే విషయం ఎవరెవరికి తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య..
రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి- రూ.5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే- ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చు. ల్యాండ్ కొనేందుకు ప్రవీణ్ ఎవరికి డబ్బులు ఇచ్చారు? పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వస్తే నిజాలు తెలుస్తాయి. ప్రవీణ్ మరణంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుం ఆయన వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి.
Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!
ఇదిలా ఉంటే.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఆయన ఎలా చనిపోయారు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రవీణ్ పోస్టుమార్టానికి సంబంధించి నివేదిక రానుంది. పోస్టుమార్టం రిపోర్టుతో మరింత సమాచారం వచ్చే ఛాన్స్ ఉంది. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే సమయంలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
case | today telugu news
AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!
ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు
Teacher crime: టీచర్ కాదు కామాంధురాలు.. విద్యార్థి తండ్రితో రాసలీలలు.. ఆ తర్వాత!
బెంగళూరులో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని. శ్రీదేవిని అరెస్ట్ చేశారు. క్రైం | నంద్యాల | Latest News In Telugu | నేషనల్
Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్
ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Anakapalli: ఏపీలో షాకింగ్ తీర్పు.. 7ఏళ్ల చిన్నారి గొంతు కోసి హత్య- మరణ శిక్ష విధించిన కోర్టు
7ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో చోడవరం కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. 2015లో శేఖర్ అనే యువకుడు 7ఏళ్ల బాలికను బీరు సీసాతో గొంతుకోసి చంపేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Gang rape: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!
బీహార్‌లో దారుణం జరిగింది. భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. మరొకరి కోసం పోలీసులు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Rape case: వీడు పాస్టర్ కాదు పాపి.. అత్యాచారం కేసులో బజీందర్‌కు జీవిత ఖైదు!
పంజాబ్ పాస్టర్ బజీందర్ సింగ్ అత్యాచారం కేసులో మొహాలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తన ఆఫీసులో ఉద్యోగిపై లైంగిక. : క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు
Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్
PBK VS LSG: లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు
Life Style: ఈ సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తింటే డేంజర్!