Pastor Praveen Death Mistery:
పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ రిపోర్ట్ ఇంకా విడుదల చేయక పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడంతో మహాజన రాజేష్ తో పాటు, కేఏ పాల్ తదితరులు అనుమానం వ్యక్తం చేశారు. నిజాలు దాచే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యే అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఇప్పటికే ఆరోపించారు.
Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
సోమవారం రాత్రి రాజమండ్రి శివారులోని కొంతమూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. బుల్లెట్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందని తొలుత అంతా భావించారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనిత స్పందించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
అయితే ఇంత వరకు పోలీసులు పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పష్టమైన ప్రకటన చేయక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య