ఎంత బలుపురా.. మద్యం మత్తులో100 స్పీడ్తో కారు నడిపి.. మహిళ స్పాట్ డెడ్

గుజరాత్ లోని వడోదరలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు.  100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైకర్స్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి

New Update
car gujarat

గుజరాత్ లోని వడోదరలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు.  100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైకర్స్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా

కారు నడిపిన యువకుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.  చనిపోయిన మహిళను హేమాలిబెన్ పటేల్‌గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో జైని (12), నిషాబెన్ (35), ఓ 10 ఏళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు.  ప్రమాదంపై పోలీసులు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లీనా పాటిల్ మాట్లాడుతూ..   డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. ఇది మద్యం తాగి వాహనం నడపడం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. నిందుతుడి ఏమైనా మాదకద్రవ్యాలు తీసుకున్నాడా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also read :  రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ కొట్టేయాలనుకున్న దొంగని కి.మీ ఈడ్చుకెళ్లారు. ఇది బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర జరగ్గా.. సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. కిటికీలోంచి ఫోన్ లాక్కొని పారిపోదామని చూసిన దొంగ చేయి ప్యాసింజర్ గట్టిగా పట్టుకున్నాడు.

New Update
running train theft

కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. దీంతో స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ కాగానే.. ప్యాసింజర్ల ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయిస్తు్న్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనం కేసులు చాలా జరుగుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం ప్యాసింజర్ చేయడనే ధైర్యంతో చైన్ స్నాచర్లు, 420లు ఇలా చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసిన ఓ దొంగ దొరికిపోయాడు. కిటికీలోంచి దొంగని గట్టిగా అలానే పట్టుకొని కిలోమీటర్ వరకు అలానే లాక్కెల్లారు. ఈ ఘటన బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ వాడుతున్నాడు. దానిపై కన్నేసిన దొంగ కిటికీలోచ్చి ఫోన్ లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రయాణికుడు అప్రమత్తంగా ఉండటంతో దొంగ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తన ఫోన్‌తోపాటు దొంగ చేయి కూడా వదలకుండా గట్టిగా ఉడం పట్టు పట్టినట్లు పట్టుకున్నాడు. గజేంద్రమోక్షంలో ఏనుగు కాలు నోట కరుచుకున్న మొసలిలా ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకొని కిలో మీటర్ వరకు రన్నింగ్ ట్రైన్‌లో ఈడ్చుకెళ్లాడు. తలపై రెండుమూడు దెబ్బలు కూడా తగిలించారు తోటి ప్రయాణీకులు. దీంతో దొంగ చేయి కిటికీలోపల, తల, కాళ్లు, బాడీ ట్రైన్ బయట ఉంది. గిలిగిలా కొట్టుకుంటూ దొంగ కదులుతున్న ట్రైన్‌లో కిలో మీటర్ దూరం వెళ్లాడు. దీన్ని అదే బోగీలో కూర్చున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment