/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
betting app suicide
TG News: తెలంగాణలో మరో యువకుడు బెట్టింగ్ యాప్ లకు బానిసై ప్రాణాలు తీసుకున్నాడు. లక్షలు పోగొట్టుకొని.. చివరికి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వయసు పైబడిన తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన సమయంలో తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరో యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్..
— RTV (@RTVnewsnetwork) April 2, 2025
నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూర్‌లో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు.
దీంతో ఆకాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.@SajjanarVC… pic.twitter.com/mtHqEsn2HL
పురుగుల మందు తాగి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ అనే యువకుడు కొంతకాలంగా ఆన్ లైన్ గేమ్స్ కి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆన్ గేమ్స్ లో లక్షల రూపాయలు పెట్టి పోగోట్టుకున్నాడు. మొత్తం 5 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్థే ఏమవుతుందో అని భయపడిన ఆకాష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ ల నిర్మూలనపై కఠిన చర్యలు చేపట్టింది. ఎంతోమంది యువత చావులకు కారణమైన బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇన్ ఫ్లుయెన్సర్ల నుంచి స్టార్ సెలెబ్రెటీల వరకు అందరి పై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే విష్ణు ప్రియా, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, పల్లవి ప్రశాంత్, రానా, విజయ్ దేవరకొండ పలువురిపై కేసులు నమోదయ్యాయి.
Also Read: ‘అమరావతికి ఆహ్వానం’... ఫస్ట్‌లుక్‌తోనే బయపెట్టారుగా!