/rtv/media/media_files/2025/02/14/OrgVWny0gYhLPax8Zwlu.jpg)
nagendrababu (photo in twitter )
కొత్తగా పెళ్లి అయింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది అ యువతి.. కానీ ఆమె ఆశలన్నీ కొన్నాళ్లకే అడియాశలుగా మిగిలిపోయాయి. కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆమె భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో భరించింది. మారుతాడులే అనుకుంది. పిచ్చిమరింతగా ముదరడంతో చివరికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం గోపాలపురంలో నవ వధువు వసంత ఆత్మహత్య
— Lokal App- Telugu (@LokalAppTelugu) February 14, 2025
అశ్లీల వీడియోలు చూపించి సైకో భర్త నాగేంద్రబాబు టార్చర్
వివాహమై 11 నెలలు.. నిత్యం వసంతతో వాగ్వాదం
పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్రబాబు
అత్త, మామ, మరిది, భర్త కలిసి చంపేశారంటున్న వసంత కుటుంబ సభ్యులు pic.twitter.com/t1Y2rKRZEG
Also Read : మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?
11 నెలలు కిందట పెళ్లి
విశాఖలోని గోపాలపట్నం నందమూరి కాలనీకి చెందిన నాగేంద్రబాబుకు 11 నెలలు కిందట వసంతతో పెళ్లి అయింది. కామపిచ్చితో నాగేంద్రబాబు.. వసంతను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేశాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకుని పలుమార్లు వాపోయింది వసంత.భర్త మారుతాడులే అని కొన్ని రోజులు ఓపిక పట్టింది. పిచ్చి తగ్గకపోగా మరింత పెరగడంతో భరించలేకపోయింది.
Also Read : బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి
ఇదే విషయంపై గతరాత్రి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాపోయింది వసంత. అయితే రేపు వచ్చి మాట్లాడాతామని ఆమెకు ధైర్యం చెప్పారు కుటుంబ సభ్యులు. అయితే ఇంతలోనే వసంత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని వారికి ఫోన్ వచ్చింది. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లిందండ్రులు, బంధువులు. అశ్లీల వీడియోలు చూపిస్తూ వసంతను టార్చర్ చేస్తున్నాడని.. కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు. అత్త, మామ, మరిది, భర్త కలిసి వసంతను చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కే.జీ.హెచ్ కి తరలించారు.
Also read : Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి!
Also Read : Donald Trump : బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్