AP Crime : కూతురికి పెళ్లి సంబంధం చూసి.. కార్లో రమ్మన్నా వినలేదు :  అంతలోనే ఘోరం!

కూతురి పెళ్లి సంబంధం చూసి, ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వస్తున్న ఆ దంపతులను మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఎండ ఎక్కువగా ఉందని, కార్లో రావాలని కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా బైక్‌పై బయలుదేరిన ఆ భార్యాభర్తలు.. మధ్యలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు.

New Update
ap crime

కూతురి పెళ్లి సంబంధం చూసి, ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వస్తున్న ఆ దంపతులను మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఎండ ఎక్కువగా ఉందని, కార్లో రావాలని కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా బైక్‌పై బయలుదేరిన ఆ భార్యాభర్తలు.. మధ్యలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. చేబ్రోలు దుర్గాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

 కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సామర్లకోటకు చెందిన జూరెడ్డి వెంకట సూర్యనారాయణ (45), జూరెడ్డి అరుణ కుమారి (40) దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. కూతురి పెళ్లి సంబంధం విషయమై వరుడిని చూసేందుకు వీరి కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు కలిసి తుని పట్టణానికి వెళ్లారు. అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడిన తర్వాత అందరూ కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కుటుంబంలోని నలుగురు సభ్యులు కార్లో బయలుదేరారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, బైక్ వద్దు కార్లోనే వచ్చేయాలని సూర్యనారాయణ దంపతులకు కుటుంబ సభ్యులు పలుమార్లు నచ్చజెప్పారు. అయినా సరే, తాము బైకు పైనే వస్తామని చెప్పి ఆ దంపతులు బైక్‌పై బయలుదేరారు.

తుని నుంచి వస్తుండగా.. చేబ్రోలు దుర్గాడ సమీపంలోకి రాగానే అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బ్యూటీ పార్లర్, బొటిక్ నిర్వహిస్తూ

మృతుల్లో భార్య అరుణ కుమారి సామర్లకోట ప్రెసిడెంట్ గారి వీధిలో బ్యూటీ పార్లర్, బొటిక్ నిర్వహిస్తూ అందరికీ సుపరిచితులుగా మారారు. భర్త వెంకట సూర్యనారాయణ సామర్లకోటలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కూతురి పెళ్లి చేసి మురిసిపోవాల్సిన తల్లిదండ్రులు.. ఇలా ఒకేసారి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో సామర్లకోటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతుల ఆకస్మిక మృతితో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు వారి కుటుంబానికి తమ గాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు