పెళ్లి అని ఫిక్స్ అయితే అన్ని పనులు కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి ఎక్కడ, రిషప్షన్, హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలని అనుకుంటారు. అయితే ఇలానే ఓ వ్యక్తి కూడా హనీమూన్ డెస్టినేషన్‌కి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ చివరకు యాసిడ్ దాడికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానేకు చెందిన ఓ వ్యక్తికి కొత్తగా పెళ్లయ్యింది.
ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
వాగ్వాదం మొదలు కావడంతో..
ఈ సీజన్లో హన్మూన్కి కశ్మీర్ వెళ్తే బాగుంటుందని అతని భార్య, తను కలిసి ప్లాన్ చేసుకున్నారు. కానీ కొత్త జంట కశ్మీర్‌కి వెళ్లవద్దని, విదేశాల్లో ఉన్న మతపరమైన ప్లేస్‌లకు వెళ్లాలని అతని మామ అన్నారు. ఈ విషయంపై మామ, అల్లుడి మధ్య వాగ్వాదం మొదలైంది. గొడవ చెలరేగడంతో మామ అల్లుడిపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ యాసిడ్ దాడిలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
వాగ్వాదం జరిగిన రోజు మామ అల్లుడి కోసం కార్ పార్కింగ్ దగ్గర చూశాడు. అల్లుడు వచ్చిన వెంటనే వెనుక నుంచి వెళ్లి మామ యాసిడ్ వేశాడు. దీంతో అల్లుడి ముఖం, శరీరంపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం మామ పరారీలో ఉన్నాడు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 124-1, 351-3 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
ఇది కూడా చూడండి: సౌత్ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు