Shirdi Accident: సంక్రాంతి పండగ వేళ పలు చోట్లలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఎంతో విషాదకరం. తాజాగా మహారాష్ట్రలోని మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం హృదయవిదారకం. కుటుంబ సభ్యుల మరణంతో బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Also Read: Daaku Maharaaj Day 1 Collections: 'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ ఊచకోత.. తొలి రోజే ఎన్ని కోట్లంటే !
షిరిడీ పర్యటనకు వెళ్తుండగా..
అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. భవనగిరి జిల్లాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం షిరిడీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో షిరిడీ సమీపంలో వారు వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Life Style: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు? ప్రధాన కారణాలివే
కాకినాడలో మరో ప్రమాదం
ఇది ఇలా ఉంటే ఏపీలోని కాకినాడ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ప్రతిపాడు మండలం ఒమ్మంగి శివారులో అదుపు తప్పిన మినీ వ్యాన్ లోయలో పడిపోవడంతో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. సంక్రాంతి పండగ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. పండగ వేళ ఇలా జరగడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!
Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?