/rtv/media/media_files/2026/04/15/180-minors-2026-04-15-13-08-31.jpg)
Maharashtra Crime
Maharashtra Crime: ప్రేమ పేరుతో వల వేయడం.. మైనర్ బాలికలను ట్రాప్ చేయడం.. ఆపై వారిని నరకంలోకి నెట్టడం.. ఇలాంటి వందలాది ఘోరాలకు పాల్పడుతున్న ఓ కిరాతకుడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. సుమారు 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించి, వారి జీవితాలతో ఆడుకున్న మొహమ్మద్ అయాజ్ (అలియాస్ తన్వీర్) అనే వ్యక్తిని అమరావతి జిల్లాలోని పరట్వాడా సిటీలో పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు అయాజ్ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నాడు. వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా అమాయక మైనర్ బాలికలను టార్గెట్ చేసి, వారితో పరిచయం పెంచుకునేవాడు. ప్రేమ పేరుతో నమ్మించి వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడు. అంతటితో ఆగకుండా, దాదాపు 350 అభ్యంతరకర వీడియోలను షూట్ చేసి, ఆ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడని విచారణలో తేలింది. ఈ వీడియోలను చూపిస్తూ బాధితులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించడమే కాకుండా, కొన్ని వీడియోలను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: గ్లోబల్ స్టేజ్‌పై "బాహుబలి ఆత్మ" కథ.. రాజమౌళి మరో సంచలనం..!
స్థానిక రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గతంలో MIM పార్టీలో ఆఫీస్‌లో పనిచేశాడని, ఆ పార్టీ నేతలతో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని ఎంపీ ఆరోపించారు. కేసు నమోదు కాగానే సదరు పార్టీ ఆ కంటెంట్‌ను తొలగించడం గమనార్హం. ఎంపీ అనిల్ బోండే జిల్లా ఎస్పీ విశాల్ ఆనంద్‌కు ఫిర్యాదు చేస్తూ.. తక్షణమే స్పెషల్ టీంతో విచారణ జరిపించాలని, లేనిపక్షంలో ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆశ్చర్యకరంగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని డిమాండ్ చేశారు.
Also Read: "సార్... వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్!" బుచ్చిబాబు కామెంట్ వైరల్!
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
పోలీసులు అయాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు, అందులో లభించిన ఆధారాలను చూసి షాక్ అయ్యారు. ఈ వీడియోలను నిందితుడు తన స్నేహితులకు పంపాడా? ఏవైనా నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నాయా? ఇంత భారీ స్థాయిలో నెట్‌వర్క్ వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపుతోంది. బాలికల రక్షణ కోసం తల్లిదండ్రులు సోషల్ మీడియా వాడకంపై నిఘా ఉంచాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
Follow Us