Maharashtra: మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఈ భుసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ దగ్గర ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్‌కి లేదా ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు.

New Update
Maharastra Train Accident

Maharashtra Train Accident Photograph: (Maharastra Train Accident)

మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భుసావల్ డివిజన్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఈ భుసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం సమయంలో లారీ ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. రైల్వే క్రాసింగ్‌ను దాటుతున్న సమయంలో రైలును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్‌కి లేదా ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే

రైల్వే క్రాసింగ్ దగ్గర దాటుతూ..

ఈ ప్రమాదంలో లారీ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికీ కూడా ఎలాంటి హాని జరగలేదు. రైల్వే క్రాసింగ్ దగ్గర లారీ రోడ్డు దాటుతూ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment