Private Bus: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి మధ్యప్రదేశ్‌లో ఖార్గోన్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించగా.. 21 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Kusuma 30 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖార్గోన్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు. ఇందులో ఓ పసి బిడ్డ కూడా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్! వారణాసిలోని రైల్వేస్టేషన్‌లో.. ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్‌లో కూడా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న 200లకు పైగా బైకులు, స్కూటర్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్లాట్‌ఫారమ్ వన్ పార్కింగ్ స్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలిసింది. ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ? వెంటనే ఈ విషయం తెలియడంతో 6 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో వాహన యజమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమను ఎవరు ఆదుకుంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు (జిఆర్‌పి) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని వారు తెలిపారు. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని చౌదరి తెలిపారు. కాగా స్టేషన్‌లోని అసిస్టెంట్ లోకో పైలట్‌లలో ఒకరైన రవి రంజన్ కుమార్ వాహనం కూడా మంటల్లో దగ్దం అయ్యింది. ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? #madhya-pradesh #road-accident #private-bus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి