/rtv/media/media_files/RyFWp6CVY6VnX9nhVUxL.jpg)
Kurnool: కర్నూల్ జిల్లా ఆదోని మండలం పాండవగల్లు దగ్గర ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక బస్సు ఓవర్ స్పీడ్ తో ఎదురుగా వస్తున్న రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బైక్లపై ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన హోంగార్డు హేమాద్రిని కాపాడేందుకు మెరుగై చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
Kurnool, Andhra Pradesh: A Karnataka bus lost control due to a broken steering rod, hitting two two-wheelers. Four died on the spot, and one succumbed at Hospital. DSP Hemalatha inspected the scene, and police are investigating pic.twitter.com/JzVsyB28OF
— IANS (@ians_india) March 11, 2025
ఐదుగురు అక్కడిక్కడే
కుప్పగళ్ గ్రామానికి చెందిన వీరన్న (25), ఆది లక్ష్మి (20) ఒక బైక్ పై వస్తుండగా.. వీరి వెనుక కర్ణాటకకు చెందిన దేవరాజు, నాగరత్న, హేమాద్రి మరో బైక్ పై వెళ్తున్నారు. ఈ రెండు బైక్ లను ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో బైకులపై ఉన్న ఐదుగురు ఎంతో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి