/rtv/media/media_files/2025/04/11/YWx4EPceXDbHDFzHInDQ.jpeg)
krishna district crime
AP Crime: ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకొడుకులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. అయితే సాయి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏదో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, కరోనా తర్వాత ఆయన వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది. పలు చోట్ల అప్పులు చేయవల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. అప్పుల నుంచి బయటపడలేకపోయిన సాయి ప్రకాష్ ఎంతో విషాదకరంగా తనువు చాలించాడు. సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు కొడుకుకు కూడా అది తినిపించాడు. చనిపోయేముందు కుటుంబ సభ్యులకు సారీ అంటూ మెసేజ్ పంపాడు. భర్త, కొడుకు మరణంతో భార్య లక్ష్మీదేవి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
latest-news | telugu-news | crime news