/rtv/media/media_files/2025/03/01/FtkqfEVRSqRRQFCMT6lh.jpg)
Kerala crime accident Photograph: (Kerala crime accident)
కేరళలోని కోజికోడ్‌లో విద్యార్థుల మధ్య సంఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఎలెట్టిల్‌లోని ఎంజె హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేశాడు.
Another Day in Communist Ruled Kerala!
— നചികേതസ് (@nach1keta) March 1, 2025
10th grade student brutally killed by neighboring school 10th graders in a street fight!
In another school, 10th graders arrested for serving drugs in their school sent off party !
Kick useless CPM out and save Kerala !! pic.twitter.com/tnBs6mfAqm
ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!
విద్యార్థిపై దాడి చేయడంతో..
దీంతో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆ విద్యార్థిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!ః
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని ఎలగెంట్ అభిరుచి అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ నంబర్ 204లో బండ్ల పూజశ్రీ (31) నివాసం ఉంటుతోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పూజశ్రీ మృతి విషయం తెలుసుకున్న సోదరి సౌమ్యశ్రీ కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పూజశ్రీ మృతిపై భర్త సునీల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూజశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూజశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై శ్రీలత తెలిపారు.
ఇది కూడా చూడండి: TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!