కోర్టు సంచలన తీర్పు.. 141 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకంటే?

కేరళకి చెందిన ఓ మైనర్ బాలికపై సవతి తండ్రి గత కొన్నేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నట్లు తేలడంతో.. అతనికి 141 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు రూ.7.85 లక్షలు జరిమానా కూడా విధించింది.

New Update
girl raped

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేరళ కోర్టు  సంచలన తీర్పును తెలిపింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకి చెందిన ఓ కుటుంబం కేరళలో నివసిస్తుంది. మైనర్ బాలిక అయిన కూతురిపై సవతి తండ్రి గత కొన్నేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఆ సవతి తండ్రిని దోషిగా నిర్థారించి 141 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కేరళ కోర్టు తీర్పునిచ్చింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం ప్రకారం మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి అష్రఫ్ అతని ఈ జైలు శిక్షతో పాటు రూ.7.85 లక్షలు జరిమానా విధించింది. 

 

updating..

Advertisment
Advertisment
తాజా కథనాలు