/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
Crime
సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.
ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
ఒక్కసారిగా తాళం తిప్పడంతో..
ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.
ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.