/rtv/media/media_files/2025/03/06/6rVVAaxVgqlmtXDMfs5K.jpg)
Karimnagar crime
Karimnagar crime: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరనే భయంతో ప్రేమికులు ప్రాణాలనే తీసుకున్నారు. అయితే చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్, భూపాలపట్నంకు చెందిన అలేఖ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో గదిలో ఉరేసుకొని చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్ (24), అదే మండలం భూపాలపట్నంకు చెందిన అలేఖ్య (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు
అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరేమో అని భయంతో క్షణికావేశంలో తన స్నేహితుని గదిలో… pic.twitter.com/bD5FiDvw5d
Also Read: RC16: జాను పాప చేతిలో గొర్రెపిల్ల.. రామ్ చరణ్ RC16 నుంచి అదిరే పోస్టర్!
విజయవాడలో మరో దారుణం
ఇది ఇలా ఉంటే విజయవాడలో మరో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం గురించి నిలదీసినందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన విజయవాడ జిల్లా గుణదలలో చోటుచేసుకుంది. మల్లపు శిరీషకు అనే మహిళకు కొన్నేళ్ళ క్రితం వెంకట్రావుతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నిన్న శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. భర్త అక్రమ సంబంధం గురించి నిలదీయడంతో అతడే శిరీషను చంపాడని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. శిరీష చావుకు భర్త వెంకట్రావే కారణమని ఆందోళనకు దిగారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. శిరీష విద్యాభారతి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్