gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రిపై కూడా గతంలో నేరారోపణలు ఉన్నాయి. 2014లో ఓ హవాలా డబ్బు కుంభకోణంలో, ఇద్దరు గ్యాంగ్ స్టర్ల ఫేక్ ఎన్‌కౌంటర్‌లో రన్యా రావు తండ్రి, డీజీపీ కె.రామచంద్రరావుపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
ranya rao father IPs

ranya rao father IPs Photograph: (ranya rao father IPs)

బెంగళూర్ ఎయిర్ పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ హీరోయిన్ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ఆమె తండ్రి కె రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటక రాష్ట్రంలో డీజీపిగా విధులు నిర్వహిస్తు్న్నారు. స్మగ్లింగ్ గురించి రామచంద్రరావుని అడగ్గా.. ఈ విషయం తనకి తెలియదని చెప్పారు. రన్యారవు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకొని ఆమె భర్తతో వేరుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆయన కూతురు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇన్వాల్ అయ్యిదని తెలియగానే షాక్‌కు గురైయ్యానని కె రామచంద్రరావు చెప్పారు. ఇలాంటి క్రిమినల్ హిస్టరీ తమ ఫ్యామిలీ రికార్డ్స్‌లో లేవని అన్నారు. రన్యా రావు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మీడియాతో అన్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే.. రన్యా రావు తండ్రి కె రామచంద్రరావు మీద కూడా కొన్ని క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి.

Also read: Ranya Rao Gold Smuggling: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

రామచంద్రరావు సొంత కెరీర్ వివాదాలతో నిండి ఉంది. 2014లో మైసూర్‌లోని సదరన్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP)గా ఆయన పనిచేస్తున్నప్పుడు హవాలా కుంభకోణంలో చిక్కుకున్నాడు. హవాలా డబ్బు తరలిస్తున్న బస్సును ఆపి, అందులో నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తరువాత కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త పోలీసులు తన నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపించాడు. మైసూర్‌లోని యెల్వాల్ ప్రాంతంలో కేరళకు వెళ్తున్న బస్సు నుంచి రూ.2.07 కోట్లు దోచుకున్నారని ఆ వ్యాపారవేత్త కేసు నమోదు చేశారు. ఈ కేసును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) స్వీకరించింది. దర్యాప్తులో పోలీసు ఇన్‌ఫార్మర్‌లను, రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మ్యాన్‌ను కూడా అరెస్టు చేశారు. దీంతో అతన్ని దక్షిణ శ్రేణి ఐజిపి పదవి నుండి తొలగించారు.

Also read: Israel Rescues Indians: పాలస్తీనాలో చిక్కుకున్న 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయిల్

2016లో రామచంద్రరావు మళ్ళీ ఇబ్బందుల్లో పడ్డాడు. గ్యాంగ్‌స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో కూడా ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావుకు సంబంధం ఉంది. ఆయన కూతురే మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన 14.8 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికింది. రన్యారావుని కస్టమ్స్ యాక్ట్ 1962  కింద అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో  అక్రమంగా బంగారం రవాణ చేయాలని తనను బ్లాక్‌మెయిల్ చేశారని ఆమె చెప్పింది. దీంతో ఈ స్మగ్లింగ్ వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు గత ఏడాది కాలంగా కన్నడ యాక్టర్ రన్యారావు 27 సార్లు దుబాయ్ ట్రిప్ వెళ్లివచ్చిందని తేలింది. ఇలా గోల్డ్ స్మగ్లింగ్‌ చేసినందుకు ఒక కేజీకి ఆమె లక్షల్లో కమిషన్ తీసుకుంటారని పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు