/rtv/media/media_files/2025/04/05/baufmvdCKI8TOPxSk8gK.jpg)
man kill his wife Photograph: (man kill his wife)
భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరుల్లా హైదర్(55)కు 2005లో అస్మా ఖాన్‌తో వివాహమైంది. వీరికి బీటెక్ చదువుతున్న ఓ కుమారుడు, 8వ తరగతి చువుతున్న ఓ కుమార్తె ఉంది. నోయిడాలోని సెక్టార్ 15లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. భార్య అస్మా ఖాన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. ఆమె భర్త జామియా మిలియా ఇస్లామియా నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. ప్రస్తుతం అతను కూడా ఓ ప్రైవేట్ ఎంప్లాయి.
Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
In Noida, 55-year-old Nurullah Haider has allegedly bludgeoned his wife to death over suspicion of her having extramarital affairs.
— SK Chakraborty (@sanjoychakra) April 5, 2025
According to the police, the accused, Nurullah Haider, hit his wife, Asma Khan, on her head with a hammer during an argument, resulting in her… pic.twitter.com/0eF5vwwlyY
Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
అస్మాఖాన్ సెక్టార్ 62లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నూరుల్లా హైదర్ ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్మాఖాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని నూరుల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సుత్తి తీసుకుని అస్మా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని వారి కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.