వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలకు దేశ వ్యాప్తంగా 170 మంది చనిపోగా 43 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ 4 వేల మంది ప్రాణాలను రక్షించింది. ముమ్మరంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. By Kusuma 30 Sep 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆకస్మికంగా వచ్చిన వరదల వల్ల తూర్పు, మధ్య నేపాల్ ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. దీంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 170 మంది మరణించారు. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల్లో 43 మంది గల్లంతు కావడంతో పాటు 111 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చూడండి: హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే? ముమ్మరంగా సహాయక చర్యలు గత 40 నుంచి 45 ఏళ్లలో ఇలాంటి వరదలు ఎప్పుడూ రాలేదని స్థానికులు చెబుతున్నారు. వరదల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మొత్తం 322 ఇళ్లు, 16 వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. హైవేలు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, వాహనాలు, భవనాలు వరదలకు కొట్టుకుపోయాయి. ఎన్నో కుటుంబాలు జలదిగ్భందంలో ఉన్నాయి. భాగమతి నది ఉగ్రరూపం దాల్చడం వల్లే ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు 4 వేల మందిని ఆర్మీ రక్షించింది. ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చూడండి: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు #floods #landslides #nepal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి