/rtv/media/media_files/2025/03/02/C8j6U8X2uv0Sy9MrEkSd.jpg)
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో ఎస్బీఐ ఏటీఎం మిషిన్ ను కట్ చేసి రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న రూ. 30లక్షల ఉబ్బుతో ఉడాయించారు. ఇదంతా కేవలం కేవలం నాలుగు నిమిషాల్లోనే జరిగింది.
Also read: Passport Rules: పాస్‌పోర్ట్ రూల్స్ మారినయ్.. కొత్త నిబంధనలు ఇవే!
ముందుగా సీసీ కెమరాలకు స్ర్పేకొట్టి , ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టారు. దొంగతనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, రెండు రోజుల క్రితం ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.
Also read: రఘురామ కృష్ణంరాజు కేసులో బిగ్ ట్విస్ట్... సునీల్‌నాయక్‌కు నోటీసులు !
దొంగల బీభత్సం
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లాలో దొంగల బీభత్సం సృష్టించారు. ఒక్కరోజే ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడి భారీగా బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లి పరారయ్యారు. వరుసగా జిల్లాల్లో దొంగతనాలు జరగడంతో జనాలు జంకుతున్నారు. ఇల్లు వదిలి వెళ్లాలంటే భయపడుతున్నారు. ముందుగా రెండు ఇళ్లల్లో దొంగతనాలు జరిగినట్లుగా సమాచారం అందింది. ఇక్కడ నివసించే చిన్న వెంకట్ రెడ్డి ఇంట్లో 12 తులాల బంగారం అయినట్లుగా ఫిర్యాదు అందింది. ఆ పక్కనే ఉన్న మహేశ్వర్ రెడ్డి ఇంట్లో 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇలా నందిగామలో ఒక్కరోజే 20 తులాలకు పైగా బంగారం చోరీ అయింది. ఇదే మండలంలోని లక్ష్మిపురంలో ఓ మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగింది.
Also read : దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!
Also read: న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ ఈరోజు.. విజయపరంపర కొనసాగిస్తుందా..