నకిలీ ఎస్ఐలు.. చీప్గా రూ. 10 వేలు అడిగి దొరికిపోయారు!

నకిలీ ఎస్ఐలుగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హుజూర్నగర్లో చోటుచేసుకుంది. ఓ గోల్డ్ షాపు యజమానికి ఫోన్ చేసి నువ్వు దొంగల నుంచి బంగారం కొన్నావంటూ బెదిరించి రూ. 10 వేలు డిమాండ్ చేశారు.

New Update
fake si nalgonda

నకిలీ ఎస్ఐలుగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హుజూర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన ప్రశాంత్, అక్షిత్, నల్గొండకు చెందిన ఇరాన్, వాజిద్  ఏపీలోని కుప్పం ఎస్ఐ ఫొటోను డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా  హుజూర్ నగర్ లో ఓ గోల్డ్ షాపు యజమానికి ఫోన్ చేసి నువ్వు దొంగల నుంచి బంగారం కొన్నావని... త్వరలో నువ్వు జైలుకు వెళ్తావ్ అంటూ బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన ఆ గోల్డ్ షాపు యజమాని వారికి రూ.10 వేలు పంపాడు. ఆ తరువాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా..  పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నారు.  వారి నుంచి రెండు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు 24 వేల 900 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.  

ఈజీగా డబ్బులు సంపాదించాలని

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నిందితులు నలుగురు చెడు అలవాట్లకు బానిసలయ్యారని.. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో ఎస్సైల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని ఆ ఫోటోలను వారి ట్రూ కలర్ డీపీగా పెట్టుకుంటారని తెలిపారు. అలా గోల్డ్ షాపు యాజమానుల వివరాలు స్వీకరించి వారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ నుండి ఎస్సైని మాట్లాడుతున్నామని బెదిరించే వారని తెలిపారు. అందులో భాగంగానే మార్చి 01వ తేదీన తిరుమలగిరి గ్రామానికి చెందిన శివ కుమార్ అనే జువెలరీ షాప్ యజమానికి ఫోన్ చేసి అతన్ని బెదిరించి రూ. లక్ష అడిగారని.. అతను భయపడిపోయి రూ.52 వేలు పంపినట్లుగా విచారణలో తేలిందన్నారు.  అలాగే మార్చి 08వ తేదీన శ్రీనిధి జ్యువలరీ షాప్ యజమాని తుడిమల్ల నవీన్ కుమార్ కు ఫోన్ చేసి నేను కుప్పం ఎస్సైని మాట్లాడుతున్నామంటూ బెదిరింపులకు పాల్పడట్టుగా తేలిందన్నారు. అయితే ముందుగా వారికి రూ. 10 వేలు పంపిన యజమాని అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది.  

Also Read :  Kumbh Mela: కొంపముంచిన కుంభమేళా పబ్లిసిటీ.. ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు