Maoist Attack: మవోయిస్టులకు మరో దెబ్బ.. శబరినదిలో భారీ ఎన్‌కౌంటర్! మవోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్ కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్ లో 10 మంది మవోయిస్టుల మరణించారు. శబరినది దాటుతున్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన డీఆర్జీ టీం మావోయిస్టులు తారస పడడంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. By srinivas 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 13:09 IST in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Maoist: మవోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్ కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పోలీసులు కాల్పుల్లో 10 మంది మవోయిస్టుల మరణించారు. శబరి నది దాటి వస్తున్నారనే పక్క సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన డీఆర్జీ టీం మావోయిస్టులు తారస పడడంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ మేరకు సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు మొదలవగా.. పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..! భారీ ఆయుధ సామాగ్రి స్వాధీనం.. ఇప్పటివరకు మొత్తం 10 నక్సల్స్ మృతదేహాలు లభ్యమయ్యాయి. INSAS, AK-47, SLR & అనేక ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. సుక్మా జిల్లాలోని కొంటా, కిస్టారం ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ సభ్యులపై DRG & CRPF బలగాలు నిఘాపెట్టి దాడులు చేస్తున్నాయి. సుక్మా జిల్లాలోని బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజుగూడ, దంతేస్‌పురం, నాగారం, భండార్‌పదర్ గ్రామాల అటవీ-కొండల్లో నక్సలైట్ల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మొత్తం సమాచారం విడుదల చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి ఇది కూడా చదవండి: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్! #encounter #maoist #chattisghad #chhattisgarh maoist attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి