/rtv/media/media_files/2025/03/29/ojiAAXjO3RWnyo3n8teY.jpg)
ol-couple Karnataka
Cyber Crime: సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) చేతిలో రూ.50 లక్షలు మోసపోయిన ఓ వృద్ధ దంపతులు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక(Karnataka)లోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. దియాంగో నజరత్ (83) గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోగా, అతని భార్య ప్లేవియానా నజరత్ (79) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ సూసైడ్ నోట్ కూడా రాస్తూ అందులో తమ మరణానికి గల కారణాలను వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇది కూడా చూడండి: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నటిస్తూ వృద్ధ దంపతులను మోసగాళ్లు వీడియో కాల్ ద్వారా బెదిరించారు. ఓ క్రిమినల్ కేసులో వారి ప్రమేయం ఉందని బెదిరిస్తూ సెటిల్మెంట్ ఫీజుగా రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర సెక్రటేరియట్‌లో గతంలో పనిచేసిన ఈ రిటైర్డ్ దంపతులు ఆ స్కామర్లకు ఈ మొత్తాన్ని చెల్లించారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల నుంచి ఈ వేధింపులు ఆగలేదు. మోసగాళ్ళు వారిని బెదిరించి మరింత డబ్బు వసూలు చేస్తూనే ఉన్నారు.
ఇది కూడా చూడండి: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
పిల్లలకు చెప్పకుండా
దీని ఫలితంగా మొత్తం వారు సుమారుగా రూ. 50 లక్షలకు పైగా వసూలు చేశారు. జరిగిన విషయాన్ని పాపం ఈ వృద్ధ దంపతులు తమ పిల్లలకు చెప్పకుండా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదట హత్య కేసుగా అనుమానించిన పోలీసులు.. ఆ జంట సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, వారి మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం బెళగావి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారి బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసామని..జరిగిన సైబర్ దోపిడీ గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు పోలీసులు.
ఇది కూడా చూడండి: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. రవీంద్ర జడేజా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు!