/rtv/media/media_files/2025/02/21/GrpAU58XqULgzEcrHV7g.jpg)
కట్టుకున్న భార్యతో తాగిన మైకంలో నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ రచ్చ చేశాడో ఎస్సై.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు ఉన్నాతాధికారులు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాస్‌గంజ్ ఎస్సైగా పని చేస్తున్న ఓ పోలీసు ఆఫీసర్ డ్యూటీ నిమిత్తం ఇంటినుంచి ఫుల్ గా తాగి బయటకు వచ్చాడు. ఓ బస్టాండు వద్దకు వెళ్లి అక్కడ కూర్చున్నాడు. అదే టైమ్ లో అక్కడికి వచ్చిన అతని భార్య .. భర్తను చూసి ఇలా తాగారేంటని ప్రశ్నించింది. అతడు సమాధానం చెప్పకపోగా ఒళ్లు మరిచి కామాంధుడిగా మారిపోయాడు.
क्या ये सच है @Uppolice ? pic.twitter.com/Azf6GqSXC4
— Dimpi (@Dimpi77806999) February 20, 2025
Also Read : సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు
ఎక్కడ పడితే అక్కడ చేతులు
నడిరోడ్డు.. పది మంది చూస్తున్నారన్న అనేది లేకుండా భార్యపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ రెచ్చిపోయాడు. పాపం ఆమె ఏంటండి ఈ పని అంటూ అతడిని వదిలించుకుంటోంది. ఇదంతా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు జనం. అందులోనుంచి ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి
सोशल मीडिया पर वायरल वीडियो का संज्ञान लेकर सम्बन्धित उ0नि0 को तत्काल प्रभाव से निलम्बित किये जाने एवं विभागीय जाँच एवं कार्यवाही के सम्बन्ध में अपर पुलिस अधीक्षक कासगंज द्वारा दी गई बाइटः- @dgpup @Uppolice @adgzoneagra @rangealigarh pic.twitter.com/F2OLAjSmnt
— KASGANJ POLICE (@kasganjpolice) February 19, 2025
Also Read : సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000
పది మందిలోనే భార్యతో ఇంత అసభ్యంగా ప్రవర్తించాడంటే.. ఎవరూ లేకపోతే అమ్మాయిలతో మరెలా ప్రవర్తిస్తాడో అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇది కాస్త ఉన్నాతాధికారుల దృష్టికి రావడంతో అతడిపై చర్యలకు ఉపక్రమించారు. అతడిని సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని వివరిస్తూ.. పోలీసులు అధికారులు ఓ వీడియోను విడుదల చేశారు. అలాంటి పోలీసులను సస్పెండ్ చేస్తేనే సరిపోదని వారు ఎక్కడికి బదిలీ అయి వెళ్లిన తమ అసభ్య ప్రవర్తనను కొనసాగిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పూర్తిగా అతడిని పోలీసు పదవి నుంచి తప్పించాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : AP POILITICS: జగన్ కు ఊహించని షాక్.. ఆ నేతలంతా జనసేనలోకి!