/rtv/media/media_files/2025/04/02/YfG16VxKiT7zo9YGULuY.jpg)
retired Colonel Photograph: (retired Colonel)
డిజిటల్ అరెస్టు కారణంగా రిటైర్డ్ కల్నల్ దంపతులు భారీగా మోసపోయారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి సేవ్ చేసుకున్న రూ.3.4 కోట్లు కోల్పోయారు. పది రోజుల పాటు మోసగాళ్లు ఆ దంపతుల్ని డిజిటల్ అరెస్టు చేసి ఆ మొత్తాన్ని కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 82 ఏళ్ల రిటైర్డ్ కల్నల్ దలీప్ సింగ్, ఆయన భార్య రవీందర్ కౌర్ బాజ్వాతో కలిసి చండీఘడ్‌లోని సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు. అయితే ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు ఆ వృద్ధ జంటను మోసం చేశారు. తొలుత వాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి బెదిరించారు. ఆ తర్వాత కోర్టు నోటీసులు ఇచ్చి భయపెట్టారు. చండీఘడ్ సైబర్ సెల్‌లో ఆ వృద్ధ జంట ఫిర్యాదు చేసింది.
How can a retired Colonel be so naive and foolishhttps://t.co/Rinb7ZdAbr
— Chandru (@ChandrusWeb) April 2, 2025
మార్చి 18న సింగ్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబైలోని కెనరా బ్యాంక్‌తో ఉన్న అకౌంట్‌తో మనీ ల్యాండరింగ్ లింకు ఉన్నట్లు ఆ కాల్‌తో సింగ్‌ను బెదిరించారు. జెట్ ఎయిర్‌వేస్ ఓనర్ నరేశ్ గోయల్‌కు మనీ ల్యాండరింగ్ చేసినట్లు సైబర్ నేరగాళ్లు ఆరోపించారు. ముంబైలో దలీప్ సింగ్ బజ్వా పేరుతో అకౌంట్ ఉన్నట్లు ఆయన భార్యకు నేరగాళ్లు ఫోన్ చేశారు. భర్త పేరుతో ఉన్న ఓ కార్డును కూడా చూపించారు.
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
సింగ్ పేరుతో ఉన్న కార్డును చూపించి. 5 వేల కోట్ల ఫ్రాడ్‌తో కనెక్షన్ ఉన్నట్లు బెదిరించారని కౌర్ పేర్కొన్నది. ఆ స్కామ్‌లో 24 మంది బాధితులు ఉన్నట్లు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశారని చెప్పిందామె. మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతుల్ని డిజిట్ అరెస్టు చేశారు. ఫోన్లు ఎప్పటికీ ఆన్‌లో పెట్టుకోవాలని ఆ జంటను నేరగాళ్లు హెచ్చరించారు. ఎవర్నీ కాంటాక్టు కావొద్దన్నారు. విషయం బయటకు తెలిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. సుప్రీంకోర్టు లెటర్ ప్యాడ్‌తో ఉన్న లేఖల్ని కొన్ని చూపించారు. అయితే తీవ్ర వత్తిడికి లోనైన ఆ జంట.. తమ అకౌంట్లలో దాచుకున్న 3.4 కోట్లను సైబర్ నేరగాళ్లకు చెందిన వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు.