/rtv/media/media_files/2025/03/13/Uh3cpP1zzmHviMkpYsZf.jpg)
ఢిల్లీలోని మహిపాల్‌పూర్ హోటల్‌లో బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అతని సహచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని వసుంధరకు చెందిన కైలాష్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం అతనికి ఇన్ స్టాగ్రామ్ ద్వారా లండన్ నివాసి అయిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ మహారాష్ట్ర, గోవా పర్యటనలో ఉన్నప్పుడు కైలాష్‌ను ఫోన్ చేసి తనను కలవమని చెప్పింది. అయితే, కైలాష్ ఆమెను ఢిల్లీకి రమ్మని కోరాడు. దీంతో ఆమె మహిపాల్‌పూర్ హోటల్‌లో దిగాక కైలాష్ కు ఫోన్ చేసి రమ్మంది. అక్కడ రాత్రి ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం కైలాష్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.
Also read : అయ్యో.. ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తే గదిలో ఏం జరిగిందో చూడండి!
Also read : అనుపమ 'పరదా' క్లైమాక్స్ లో సామ్.. రోల్ ఏంటో తెలుసా?
స్నేహితుడు కూడా లైంగికంగా
కైలాష్ నుంచి తప్పించుకుని బాధితురాలు హోటల్ రిసెప్షన్‌కు చేరుకుంది, అయితే ఆమె బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా లిఫ్ట్‌లో ఆమెను అతని స్నేహితుడు వసీం కూడా లైంగికంగా వేధించాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గురించి సమాచారాన్ని బ్రిటిష్ హైకమిషన్‌కు కూడా అందించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలు పోలీసులను సంప్రదించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కైలాష్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతను ఇంగ్లీష్ మాట్లాడటం కష్టమైందని.. తనతో కమ్యూనికేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఉపయోగించాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. దుపరి దర్యాప్తు జరుగుతోంది.
Also read : సీఎంతో రహస్యంగా భేటీ.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ కీలక కామెంట్స్!
Also Read : 96 బిలియన్ డాలర్ల స్కాం.. ఇంటర్‌నేషనల్ క్రిమినల్‌ని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు