/rtv/media/media_files/2025/03/03/AU0jnlQd0zKwJzZcYRpJ.jpg)
ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు.. సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ... ఈ ఘటన బిహార్‌లోని ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది. తన సొంత కుమారుడిని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అనుమానంతో బబితా దేవిని విచారించగా.. తామే కిడ్నాప్ చేశామని విచారణలో అంగీకరించింది. దీంతో బబితా దేవితో పాటుగా ఆమె ప్రియుడు నీతీశ్‌కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల బాలుడి మామ ఆదిత్య కుమార్ తన కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సరన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) కుమార్ ఆశిష్ తెలిపారు. రూ. 25 లక్షల ఇవ్వకపోతే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లమని చెప్పి బెదిరించినట్లుగా తెలిపారు.
Also Read : కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. చంపింది అతనే !
భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో
భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2025 ఫిబ్రవరి 05వ తేదీన తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు సుకన్య భర్త జయరాజ్. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా సుకన్యను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ గోపీ అనే ఓ వ్యక్తి బైక్ ఎక్కి వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. వీరిద్దరని చివరకు మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. అయితే బైక్ ను అక్కడ వదిలేసిన గోపి, సుకన్య రన్నింగ్ బస్సు ఎక్కి వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా దొరకలేదు. ప్రస్తుతం పోలీసులు వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Also read : Shresta Iyer : ఐటమ్ సాంగ్లో రెచ్చిపోయిన శ్రేయాస్ అయ్యర్ సిస్టర్.. కిల్లింగ్ స్టెప్స్