Karnataka : తూ..  కామాంధుడా: మార్చురీలో మహిళల శవాల బట్టలు విప్పి... దారుణంగా

టీచింగ్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే ఒక అటెండెంట్, పోస్ట్‌మార్టం కోసం వచ్చే చనిపోయిన మహిళల శవాల బట్టలు తొలగించి, తన మొబైల్ ఫోన్‌తో నగ్నంగా ఫోటోలు తీస్తూ దొరికిపోయాడు.

New Update
arrest

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఒక అత్యంత విచారకరమైన, దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి బిరిమ్స్ (BRIMS) టీచింగ్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే ఒక అటెండెంట్, పోస్ట్‌మార్టం కోసం వచ్చే చనిపోయిన మహిళల శవాల బట్టలు తొలగించి, తన మొబైల్ ఫోన్‌తో నగ్నంగా ఫోటోలు తీస్తూ దొరికిపోయాడు. ఈ నీచమైన పనికి పాల్పడిన నిందితుడిని మునీర్ అహ్మద్‌గా గుర్తించి, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఆసుపత్రిలోని బీఆర్‌ఐఎమ్‌ఎస్ విభాగం అధిపతి (HOD) డాక్టర్ మోసినూల్ హక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు మునీర్ అహ్మద్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ మార్చురీలోనే అటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, పోస్ట్‌మార్టం జరిగే సమయంలో ఎవరూ లేనిది చూసి, చనిపోయిన ఆడవాళ్ల మృతదేహాలపై ఉన్న బట్టలు తీసేసి, ఎలాంటి పర్మిషన్ లేకుండా తన పర్సనల్ ఫోన్‌తో నగ్న ఫోటోలు తీస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్‌లో దాచిపెట్టి

ఇలా తీసిన ఫోటోలన్నింటినీ అతడు చాలా చెడు ఉద్దేశంతోనే తన మొబైల్ ఫోన్‌లో దాచిపెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దారుణం గురించి తెలిసిన ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితుడు చేసిన పని మెడికల్ ఎథిక్స్ కు పూర్తిగా విరుద్ధమని, చనిపోయిన మహిళల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని, భావోద్వేగాలను తీవ్రంగా గాయపరిచిందని ఆసుపత్రి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్పిటల్ హెడ్ ఇచ్చిన ఫిర్యాదుతో బీదర్ న్యూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడు మునీర్ అహ్మద్‌పై BNSలోని సెక్షన్ 301, 62 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆసుపత్రి మార్చురీలలో సిబ్బంది ప్రవర్తనపై, అక్కడ జరిగే పనులపై గట్టి నిఘా ఉంచాలని, చనిపోయిన వారి గౌరవానికి, ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కఠినమైన రూల్స్ తీసుకురావాలని ఈ ఘటన తర్వాత సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. కేసు దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు