ap central university
Also Read: Prabhas Salaar: ఇదిరా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. 366 రోజులు ట్రెండింగ్‌లోనే ‘సలార్’
అమ్మాయిల బాత్‌రూంలోకి
యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు లేడీస్ బాత్‌రూంలోకి తొంగి చూస్తున్నట్లు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలిపారు. DGP, DIGలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మళ్లీ కొందరు బాత్‌రూంలోకి తొంగిచూడటంతో అమ్మాయిలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో మరోసారి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Shweta Basu: తెలుగు సెట్ లో నాకు పదే పదే అది చెబుతూ వేధింపులు .. శ్వేతా బసు సంచలనం
గతంలో మల్లారెడ్డి కాలేజీలోనూ..
ఇది ఇలా ఉంటే గతంలో హైదరాబాద్ మేడ్చల్ లోని మల్లారెడ్డి కాలేజీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నట్లు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇప్పటికే 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5మంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల ఆరోపణలు నిజమని తేలితే నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ACP శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.