/rtv/media/media_files/2025/03/11/xn4TbqkvmR5OTUcNkpAv.jpg)
AMRUTHA PRANAY
AMRUTHA PRANAY: మిర్యాలగూడకు చెందిన అమృత- ప్రణయ్ ల ప్రేమ, పెళ్లి.. ఆ తర్వాత తమ జీవితంలోకి మరో చిన్ని ప్రాణం రాబోతుందనే ఆనందం.. ఇంతలోనే ప్రణయ్ ని అమృత తండ్రి ఆమె కళ్ళ ముందే హత్య చేయించడం అచ్చం ఓ సినిమా స్టోరీని తలపించే నిజ జీవిత విషాద గాథ. కడుపులో ఐదు మాసాల బిడ్డను మోస్తున్న అమృత.. భర్త చావును కళ్ళ ముందే చూసి తల్లడిల్లిపోయింది. కులపిచ్చికి న్యాయంగా బలైన తన భర్త చావుకు న్యాయం జరిగే వరకు పోరాడింది. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత ప్రణయ్ ఆత్మకు శాంతి లభించింది. 2025 జనవరి 10 సోమవారం రోజున ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఏ2కు ఉరిశిక్ష, మిగతా నిందితులను యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కేసు విచారణలో ఉండగానే అవమానం, మనోవేదనతో 2020లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
అమృత పోస్ట్
ఏడేళ్ళ తర్వాత భర్త హత్య కేసులో నిందితులకు శిక్ష పడడంతో అమృత సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ''REST IN PEACE'' అంటూ భర్త పేరును ట్యాగ్ చేసింది. ప్రస్తుతం అమృత-ప్రణయ్ ల కుమారుడు నిహాన్ కి ఆరేళ్ల వయసు. భర్త హత్య తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన అమృత తన బిడ్డ కోసం కాలక్రమేణా కోలుకుంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
కొత్త జీవితం ప్రారంభిస్తుందా?
అయితే నిన్న ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చిన కొన్ని గంటల్లో అమృత తన ఇన్ స్టాగ్రామ్ ఐడీని మార్చడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లు అమృత ప్రణయ్ తో పేరుతో ఉన్న ఐడీని అమృత వర్షిణిగా మార్చారు. దీంతో అమృత కొత్త జీవితం మొదలు పెట్టబోతోందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పోగొట్టుకున్న ఆత్మీయుల జ్ఞాపకాలను ఎప్పటికీ మోస్తూ, కన్నీళ్లతో జీవితాన్ని సాగించాలి అనే నియమం లేదు కదా.. నిజంగానే అమృత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే? అది సంతోషకరమైనదే అని కొందరు నెటిజెన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భర్త చావును గుండెల్లో మోస్తూ ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపిన అమృత.. ఇకపై బిడ్డ కోసం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందా? అని అనుకుంటున్నారు.
కమిషనర్ రంగనాథ్ కు అమృత కృతజ్ఞతలు
ఇదిలా ఉంటే .. ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్.. అప్పటి నల్గొండ ఎస్పీగా ప్రణయ్ హత్య కేసును డీల్ చేశారు. 1500 పేజీల ఛార్జ్ షీట్ తో ఏ ఆధారాలు వదలకుండా అన్నింటినీ కోర్టుకు సమర్పించారు. ప్రణయ్ నేరస్థులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అప్పుడు ఆయన ఇచ్చిన మాట నేడు నెరవేరడంతో.. కమిషనర్ రంగనాథ్‌కు అమృత ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!