/rtv/media/media_files/2025/03/10/7sHxiep33K1pT2LDJSDH.jpg)
pranay amrutha case 123 Photograph: (pranay amrutha case 123)
Amrutha Pranay: 2018లో తెలంగాణ అంతటా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసులో సోమవారం కోర్టు తుది తీర్పును వెలువరించింది. అమృత భర్త ప్రణయ్ హత్యకు కారణమైన నిందితులకు కఠిన శిక్షను విధించింది. ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కేసు విచారణలో ఉండగానే 2020లోనే ఆత్మహత్య చేసుకోగా. ఏ2కు ఉరిశిక్ష, మిగతా నిందితులను యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు తర్వాత అమృత రెస్పాన్స్ కోసం అందరు వెయిట్ చేశారు. కానీ అమృత ఎక్కడ మాట్లాడలేదు. ఈ క్రమంలో తొలిసారి కోర్టు తీర్పుపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
ఇది కూడా చూడండి: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించో తెలుసా!
/rtv/media/media_files/2025/03/11/Kaz5BOVS2kx2q8yQvVVN.jpeg)
అమృత పోస్ట్
"నిరీక్షణ ముగిసింది, న్యాయం జరిగింది. ప్రస్తుతం నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. ఈ తీర్పు కులం పేరుతో జరిగే నేరాలు, దురాగతాల సంఖ్యను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
నా బిడ్డ పెద్దవాడు అవుతున్నాడు...కావున నా మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అలాగే అతని భవిష్యత్తును కాపాడుకోవడానికి నేను మీడియా ముందు కనిపించలేను, ఎటువంటి ప్రెస్ మీట్‌లను నిర్వహించలేను. దయచేసి మా శ్రేయోభిలాషులందరూ మా గోప్యతను అర్థం చేసుకుని గౌరవించాలని అభ్యర్థిస్తున్నాను. అంచంచలమైన ప్రేమ , మద్దతు అందించిన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. rest in peace pranay 10-03-2025" అంటూ పోస్ట్ పెట్టింది అమృత
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!