BIG BREAKING: చర్చి ఫాదర్ దారుణ హత్య!

యూఎస్‌లోని కాన్సాస్ స్టేట్‌లోని భారత సంతతి క్యాథలిక్ ఫాదర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. పలువురు దుండగులు అరుల్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని అక్కడి సెయింట్ మేరీ చర్చి తెలిపింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
Arul Carasala

Arul Carasala Photograph: (Arul Carasala)

యూఎస్‌లోని కాన్సాస్ స్టేట్‌లోని భారత సంతతి క్యాథలిక్ ఫాదర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. పలువురు దుండగులు అరుల్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని అక్కడి సెయింట్ మేరీ చర్చి తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కారణాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌కు చెందిన అరుల్ 2004లో కాన్సాస్‌ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే ఉంటూ ఎన్నో చర్చిల్లో సేవలు అందించారు. 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: హైదరాబాద్‌లో లారీ బీభత్సం..ట్రాఫిక్ పోలీసు దుర్మరణం!

హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌ వద్ద విధుల్లోవున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
ACCIDENT

ACCIDENT

Accident: హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్‌ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరాపోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యూటర్న్‌ సమీపంలో అదుపుతప్పి..

ఈ మేరకు కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. దీంతో యూటర్న్‌ సమీపంలో ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. అయితే అక్కడ ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న రాజవర్ధన్, వికేందర్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింహాచలం మరణించారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

ఇదిలా ఉంటే..హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

lorry | traffic-police | today telugu news

Advertisment
Advertisment
Advertisment