/rtv/media/media_files/2025/04/03/rFcZQFRe9e2dR84E3w4t.jpg)
romance Photograph: (romance)
Viral News: ప్రముఖ నటుడు, యాక్షన్ స్టార్ జీన్-క్లాడ్ వాన్ డామ్.. అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అక్రమ రవాణాకు గురైన ఐదుగురి మహిళలతో లైగింక కోరికలు తీర్చుకుంటున్నట్లు రొమేనియాలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ 64 ఏళ్ల స్ట్రీట్ ఫైటర్.. మోరెల్ బోలియా నేతృత్వంలోని క్రిమినల్ నెట్‌వర్క్ నుంచి ఐదుగురు రొమేనియన్ మహిళలను బహుమతిగా స్వీకరించాడని రొమేనియన్ అధికారులు డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం (DIICOT)కు ఫిర్యాదు చేశారు.
Bloodsport • Frank Dux Infinite Statue ⅙ Official Action figure. Full Reveal: 28 January at Nuremberg Toy Fair
— Jean-Claude Van Damme (@JCVD) January 25, 2025
Stay tuned for more announcements!#kausticplastik #infinitestatue #wfigures #bloodsport #actionfigures #actionfigures #vandamme #jcvd pic.twitter.com/8ozYK38ZSQ
క్రిమినల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి..
ఈ మేరకు ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో వాన్ డామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. ఆ మహిళల్లో ఒకరి సాక్ష్యం ఆధారంగా DIICOT దర్యాప్తు ప్రారంభించింది. బాధితుల్లో ఒకరి తరపున వాదించిన న్యాయవాది అడ్రియన్ కుకులిస్.. 'ఆ మహిళలు దుర్బల స్థితిలో ఉన్నారు. దోపిడీకి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, అతనికి ఐదుగురు రొమేనియన్ మహిళలను ఆఫర్ చేశారు' అని చెప్పారు. ఇక 2022లో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై ఆండ్రూ, ట్రిస్టన్ టేట్ అరెస్టయి ఇటీవలే దేశం విడిచి వెళ్లిన తర్వాత రొమేనియాలో ఇది రెండవ హై ప్రొఫైల్ కేసుగా పేర్కొన్నారు.
🌊 Back to the Caribbeans and back in shape.
— WFigures™ اللعب مع الكبار (@WF_figures) March 11, 2021
💪 #VANDAMME #JCVD
📷 Photo courtesy of https://t.co/hXfDXM8Al6 pic.twitter.com/Y422oIYExM
యూరోపియన్ కరాటే ఛాంపియన్..
జీన్-క్లాడ్ వాన్ డామ్ ఒక బెల్జియన్ మార్షల్ ఆర్టిస్ట్, నటుడు. 1960లో బెల్జియంలో జన్మించిన ఆయన 1980లలో హాలీవుడ్‌కు వెళ్లే ముందు కరాటే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. చిత్రనిర్మాతగా బ్లడ్‌స్పోర్ట్ (1988), కిక్‌బాక్సర్ (1989), యూనివర్సల్ సోల్జర్ (1992) వంటి యాక్షన్ చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు చేరినప్పటికీ అతను మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టపరమైన సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతను కొకైన్‌కు బానిసయ్యాడు. ఒకసారి తాగి వాహనం నడపడం, గృహ హింస కారణంగా అరెస్టు అయ్యాడు. యుక్తవయసులో కరాటేలో రికార్డులు సృష్టించిన ఇతను.. 44 విజయాలు, 4 పరాజయాలు చవిచూశాడు. 1979లో యూరోపియన్ కరాటే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న బెల్జియం కరాటే జట్టులో సభ్యుడు కూడా.
sexual-assault | actor | case | telugu-news