/rtv/media/media_files/2025/04/05/L7QpqJA7rLz1Uxjatc4I.jpg)
marriage-4
డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి ట్రాప్ చేసి నలుగురు యువకులను మోసగించింది. ఇప్పటికే ముగ్గురిని మోసం చేయగా.. తాజాగా మరో వ్యక్తిని మోసం చేయగా ఈ నిత్య పెళ్లికూతురు బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్య జిల్లా మద్దూరు జిల్లా కెస్తూరు గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమార్తె వైష్ణవి, ఇదే జిల్లా మల్లనాయకనకట్టె గ్రామానికి చెందిన శశికాంత్ ఎనిమిది నెలలుగా ప్రేమించుకున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్నారు.
Also read : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు నైజీరియన్లు అరెస్టు
తాము చాలా పేదావాళ్లమంటూ
అయితే వివాహానికి ముందే తాము చాలా పేదావాళ్లమంటూ అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రాముల బంగారం కాజేసింది. 2025 మార్చి 24న ఆదిచుంచనగిరి క్ష్రేత్రంలో వీరి పెళ్లి జరగ్గా మరుసటి రోజు కొత్త దంపతులు గౌడగెరె చాముండేశ్వరి ఆలయానికి కారులో బయల్దేరారు. అయితే ఉమ్మడిహళ్లి గెట్ వద్ద వాటర్ బాటిల్ కోసం శశికాంత్ కారు దిగగా.. అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెనకాల వచ్చిన కారులో వైష్ణవి ఎక్కి జంప్ అయింది.
Also read : Rohit Sharma : వేటు వేశారా.. లక్నోతో మ్యాచ్లో రోహిత్ ఎందుకు ఆడలేదు?
శశికాంత్ వచ్చి చూసేసరికివైష్ణవి కనిపించకుండా పోవడంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని విచారణలో తెలిసింది. ధర్మస్థలలో హాసన్‌కు చెందిని రఘుతో మొదటి పెళ్లి, శివతో రెండో పెళ్లి, రఘతో మూడో పెళ్లి జరిగిందని.. ఇలా ముగ్గురిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బు, నగలతో పరార్ అయినట్లుగా కేసులు నమోదైనట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read : Sri Varshini - Aghori: అఘోరీ శవం తినడం నేను చూశాను - అంతా చెప్పేసిన వర్షిణీ!
Also read : Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!