ఆమెను చేసుకుంటా.. నిన్ను ఉంచుకుంటా.. ప్రియుడి మోసానికి ప్రియురాలి ట్విస్ట్!

పెళ్లి చేసుకుంటనని ఓ యువతికి బాగా దగ్గరైన యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం బోరబండ పీఎస్లో ఫిర్యాదు చేసింది.

author-image
By Krishna
New Update
borabanda ps

ఫ్రెండ్స్ అన్నాడు.. ఆ తరువాత లవ్ అన్నాడు.  పెళ్లి చేసుకుంటా అని బాగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి విషయం మాట్లాడితే నా కులం వేరు..  నీది వేరు ఇంట్లో ఒప్పుకోరని మాటమార్చాడు. మరో అమ్మాయితో సిక్రెట్‌ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో రచ్చ రచ్చ అయింది. 

ఇంతకు ఏం జరిగిదంటే..  బోరబండకి చెందిన ఓ యువతికి డ్రైవర్ రాకేష్‌తో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాకేష్ ఆమెకు బాగా దగ్గరయ్యాడు.  ఆ తర్వాత ఇంట్లో మన పెళ్లికి అంగీకరించరని ఇంట్లో చూసిన అమ్మాయిని ముందుగా పెళ్లి చేసుకుంటానని.. టైమ్ చూసి నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు రాకేష్. 

ఆర్థిక సమస్యలతో ఉద్యోగం కోసం

అయితే ఆర్థిక సమస్యలతో ఉద్యోగం కోసం ఆ యువతి ఖతర్ కు వెళ్లింది.  ఇదే మంచి టైమ్ అనుకుని రాకేష్ ఇంట్లో చూసిన అమ్మాయితో ఎంగెజ్ మెంట్ చేసుకున్నాడు.  విషయం తెలుసుకున్న ప్రియురాలు ఫిబ్రవరి 18వ తేదీన హైదరాబాద్ కు వచ్చింది.  ప్రేమ వ్యవహారంపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.  దీంతో అక్కడికి చేరుకున్న రాకేష్..  పెళ్లి చేసుకుంటానని మళ్లీ నమ్మించాడు.  

రాకేష్ ఇంటికి వెళ్లి ఆత్మహత్యయత్నం

రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో  మళ్లీ ఖతర్ వెళ్లమని చెప్పడంతో ఆ యువతి ఖతర్ వెళ్ళిపోయింది. అయితే మార్చి 12న రాకేష్ పెళ్లి అని తెలియడంతో ఖతర్ నుంచి వచ్చి నేరుగా రాకేష్ ఇంటికి వెళ్లి అక్కడ అత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం యువతి బోరబండ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ప్రియుడు రాకేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ యువతికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలుస్తోంది.  

Also read :  మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి ఒకడు.. వీడియో తీసి మరోకడు..స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment